విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీస్ చంద్రబాబు కటౌట్ పైకి ఎక్కి ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని గోవిందరాజులు అనే రైతు సూసైడ్ నోట్ రాశారు. తన గోడు చెప్పుకుందామని కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అతన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. <br/>రాష్ట్రంలో రైతుల బతుకులు దుర్భరంగా మారాయి. రుణాల మాఫీ విషయంలో మోసం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం, తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం, కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలోనూ మోసం. టీడీపీ పాలనలో రైతన్న అన్ని విధాలుగా మోసపోతున్నారు. పంటలు వేసి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలే శరణ్యమని రైతులు తనువు చాలిస్తున్నారు. ఎంతసేపు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందామన్న ధ్యాసేతప్ప చంద్రబాబుకు ప్రజల కష్టాలే పట్టడం లేదని ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.