బెల్లం రైతుల‌ను ఆదుకుంటా


చిత్తూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక బెల్లం రైతుల‌ను ఆదుకుంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పాత‌గుంట గ్రామం వ‌ద్ద బెల్లం రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు. బెల్లం విక్ర‌యాల‌పై క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేద‌ని, ఎగుమ‌తుల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధిస్తుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. మా ప్రాంతంలో తయారయ్యే బెల్లం నల్లగా ఉంటుంది. దీనికి ధర ఉండదు. అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం’ అం టూ జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని పలువురు రైతులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌    రెడ్డికి విన్నవించారు.  దీనిపై  చర్చించి తగు చర్యలు తీసుకుం టామని జననేత వారికి హామీ ఇచ్చారు. 
Back to Top