<br/><br/>అనంత పురం జిల్లాలో రైతు దంపతులు ఆత్మహత్య చేసుకొన్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణ మాఫీ కాకపోవటమే శాపం గా మారింది. గోరంట్ల మండలం పుట్ల గుండ్ల పల్లికి చెందిన నంజిరెడ్డి, నంజమ్మ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామంలో అందరితో కలిసిపోయే వ్యక్తులుగా ఈ దంపతులకు పేరు ఉంది. కొడుకు తీసుకొన్న వ్యవసాయ రుణం మాఫీ కాకపోవటం, కోడలు తీసుకొన్న డ్వాక్రా రుణం మాఫీ కాకపోవటం..అప్పుల వాళ్లు ఇంటి మీద పడి వేధిస్తుండంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వ వ్యవస్థ నుంచి ఎటువంటి భరోసా ఎదురు కాకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.<br/>