వ్యవస్థ కు అవస్థలు

 హైదరాబాద్) ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్రధారిగా
నిలిచిన చంద్రబాబు..దీన్ని పూర్తిగా పక్క దారి పట్టించే యత్నంలో ఉన్నారు. ఇది పూర్తిగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా, ఆంద్రజాతికి సంబంధించిన అంశంగా మార్చేస్తున్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ లతో పనులు చేయిస్తూ మాస్టర్ గేమ్ ఆడుతున్నారు.
తాజాగా ఢిల్లీ లో ఫిర్యాదులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పేరిట దాఖలు కావటం కూడా ఈ మైండ్‌గేమ్
లో భాగమే. అంతిమంగా చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని పరిహాసం చేస్తున్నారు.

 

 అన్ని దారుల్లో విఫలం

 ఓటుకి కోట్లు కుంభకోణంలో ఇరుక్కొన్న దగ్గర నుంచి
తప్పించుకొనేందుకు చంద్రబాబు రక రకా మార్గాలు అనుసరించారు. ఢిల్లీ వె ళ్లి కేంద్ర ప్రభుత్వ
పెద్దల్ని వరుసగా కలిసి వచ్చారు. కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం లేకపోయింది. ఇందులో
జోక్యం చేసుకొనేది లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. గవర్నర్ ను బ్లాక్ మెయిల్ చేయాలని
తీవ్రంగా యత్నించారు. ఆయన మీద ఎల్లో మీడియాలో వరుసగా కథనాలు రాయించారు. అయినా గవర్నర్
తన దారిలోకి రాలేదు. ఎన్నికల సంఘం పరిధిలోనిదంటూ ముందు వాదనలు వినిపించారు. కానీ, ఎన్నికల
సంఘం కూడా నేరమయ విషయాలలో జోక్యానికి నిరాకరించింది.
దీంతో పాటు దర్యాప్తును పూర్తిగా చేయించాలని ఏసీబీ కి స్పష్టం చేసింది. దీంతో అన్ని
దారులు మూసుకొని పోయినట్లయింది.

 

 రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం

 ఈ పరిస్థితుల్లో కుంభకోణాన్ని మొత్తం ఆంద్రప్రదేశ్
ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలకు
సంబంధించిన అంశంగా మార్చేసారు. ఇందుకు అనుగుణంగా ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తున్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఎలా బయట పడాలి అనే దానిపై సీనియర్ ఉన్నతాధికారుల్ని పిలిపించి
వ్యూహ రచన చేస్తున్నారు. ముందుగానే పచ్చ మీడియాలో పోలీసు ఉన్నతాధికారుల్ని మారుస్తున్నామంటూ
కథనాలు రాయించారు. సీటు కాపాడుకోవాలంటే చంద్రబాబు చెప్పినట్లే వినాలన్న మాట అనే మైండ్
సెట్ లోకి  ఉన్నతాధికారులు వెళ్లేట్లుగా బ్లాక్
మెయిల్ చేసి పెట్టారు. అంటే ఒక నేరంలో ప్రధాన సూత్రధారి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి
కి ... నేరంలోంచి ఎలా బయట పడాలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, ఐఎఎస్ అధికారులు సలహాలు
ఇవ్వాలన్న మాట. ఈ విధంగా వ్యవస్థను తన గుప్పిట్లోకి లాక్కొని చంద్రబాబు మాస్టర్ గేమ్
కు ప్రాణం పోశారు.

 

 గవర్నర్ తో దోబూచులాట

 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన బాధ్యతలు గాలికి
వదిలేసిన చంద్రబాబు కి కంట్లోకునుకు లేకుండా పోయింది. ఈ కేసులో ఆరోపణలు మొదలవగానే దాని
నుంచి బయట పడేందుకు మీటింగ్ ల మీద మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. కేసు నుంచి బయట పడటం
ఎలా అనే ఒకే ఒక్క పాయింట్ ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థల్ని పని చేయిస్తున్నారు. గవర్నర్
నరసింహన్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన చంద్రబాబు.. తర్వాత
రాజ్ భవన్ కు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో గవర్నర్ సలహాదారుల్ని పిలిపించుకొని
మీటింగ్ పెట్టేశారు. ఉన్నతస్థాయిలోని సంప్రదాయాల్ని గాలికి వదిలేసి  ఈ కేసు విషయంలో సహాయం పొందేందుకు ప్రయత్నించారు.
అక్కడ పని జరగక పోవటంతో ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద దిక్కుగా పిలుచుకొనే ప్రధాన కార్యదర్శి,
పోలీసు డీజీపీలను ఉపయోగించుకోవటం మొదలెట్టారు.

 రాజ్ భవన్ కు వెళ్లి విభిన్న అంశాలపై ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి, డీజీపీలు మాట్లాడి వచ్చారు. ఈ ఎపిసోడ్ చుట్టూ కథ నడుస్తుండగానే ఈ సమావేశం
జరగటం కీలకం.

 

 ఢిల్లీకి ప్రధాన కార్యదర్శి

 ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు
కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే పంపించారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర టెలికాం కమిషన్
ఛైర్మన్ రాకేష్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఫిర్యాదు చేసి వచ్చారు.
అటు కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కృష్ణారావు కలిశారు. ట్యాపింగ్ విషయంలో
ఫిర్యాదే ఇక్కడ కూడా ప్రధాన అజెండా గా నిలిచిందని సమాచారం. అంటే చంద్రబాబు చేసిన తప్పుకి,
కుట్రకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్దానికి 
దిగిందన్న మాట.

 

 మొత్తం మీద ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని చెప్పు చేతల్లోకి
తీసుకొని చంద్రబాబు మైండ్‌గేమ్ ను వేగవంతం చేశారు. పరిపాలనను, ప్రజల పట్ల బాధ్యతను
తాను ఎలాగైతే గాలికి వదిలేశారో, అదే విధంగా ఉన్నత స్థాయి యంత్రాంగం గాలికి వదిలేసి,
తన కళంకాన్ని మోయాలని చంద్రబాబు భావిస్తున్నారు అవినీతి ఊబిలో పూర్తిగా కూరుకొని పోయి,
ఆ కళంకాన్ని ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు.

 

 

 

 

 

 

Back to Top