మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నిరాహారదీక్ష భగ్నం

ఒంగోలు‌, 6 అక్టోబర్ 2013:

అద్దంకి మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు గొట్టిపాటి రవికుమార్‌ సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం తెల్లవారు జామున భగ్నం చేశారు. అనంతరం ఆయనను ఒంగోలులోని రిమ్సు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రా‌ష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రె‌స్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‌రవికుమార్ ఐదు రోజులుగా అద్దంకిలో ఆమరణ నిరా‌హార దీక్ష చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకూ కీణిస్తున్నది. దీనితో ఆదివారం తెల్లవారు జామున ఆయన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

అద్దంకి - నార్కట్పల్లి హైవేపై వై‌యస్ఆర్ ‌కాంగ్రెస్ రాస్తారోకో
గొట్టిపాటి రవికుమార్ ‌ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా అద్దంకి - నార్కట్పల్లి హైవేపై పార్టీ ‌నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

Back to Top