మహానేత నిను మరువం

నువ్వు చూపిన బాటలోనే పయనం
నీ ఆశయ సాధనకు అహర్నశలు శ్రమిస్తాం
తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైయస్‌ఆర్‌కు ఘన నివాళి

అమరావతి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడడమే పదవికి సార్థకతగా భావించిన మహానేత. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల బాగోగులను అధ్యయనం చేసిన తన పాలన కాలంలో అన్ని వర్గాలకు మేలు చేసే ఎన్నో పథకాలను అమలు చేసిన మహానుభావుడు. మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. భౌతికంగా ఆయన లోకం నుంచి నిష్క్రమించినా కోట్లాది హృదయాల్లో కొలువుదీరారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయి. మహానేత  నీలాంటి నాయకుడు లేడు.. ఇక రాడు అనుకోని హృదయం అంటూ ఉండదు. వైయస్‌ఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌ అభిమానులు, ఆయన పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు ఘన నివాళులర్పించారు. 
విజయవాడ..
విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జు. గౌతమ్‌రెడ్డి, బొప్పన భవకుమార్, ఎంవీఆర్‌ చౌదరి, తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, పైలా సోమినాయుడు, పలువురు కార్పొరేటర్లు, అభిమానులు. 
అనంతపురం జిల్లా..
జిల్లా వ్యాప్తంగా మహానేత వైయస్‌ఆర్‌కు ఘన నివాళులర్పించారు. అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. అదే విధంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ఉరవకొండలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి. కల్యాణదుర్గంలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన పార్టీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌. రాయదుర్గంలో వైయస్‌ఆర్‌కు కాపు రామచంద్రారెడ్డి నివాళులర్పించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాళులర్పించారు. ధర్మవరంలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. 
చిత్తూరు జిల్లా..
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. సోమలలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాల్మీకిపురంలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఎస్‌ఆర్‌పురంలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే నారాయణస్వామి. మదనపల్లిలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి. 
కర్నూలు జిల్లాలో..
కర్నూలులో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే ఐజయ్య. కర్నూలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహానేత విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నాయకుడు గౌరు వెంకట్‌రెడ్డి. ఆలూరులో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాముడు. ఆళ్లగడ్డలో వైయస్‌ఆర్‌కు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, బిజేంద్రరెడ్డి నివాళులు అర్పించారు. 
విశాఖ జిల్లా..
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుంభా రవికుమార్‌ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. 
తూర్పుగోదావరి జిల్లా..
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. కాకినాడ రూరల్‌లో వైయస్‌ఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని వాకలపూడి, ఇంద్రపాలెం, తూరంగి వద్ద వైయస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన వైయస్‌ఆర్‌ సీపీ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, నటుడు కృష్ణుడు. తూర్పుగోదావరిలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయ్‌. రాజమండ్రి వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాష్‌రావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కోఆర్డినేటర్‌ వేణుగోపాలకృష్ణ, వైయస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు. 
పశ్చిమగోదావరి జిల్లా..
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మహానేత వైయస్‌ఆర్‌కు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. నరసాపురం నియోజకవర్గ పరిధిలో ముదునూరి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం. తణుకులో వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు. పోలవరం, బుట్టాయగూడెం, టి.నరసాపురం, కొయ్యలగూడెం మండలాల్లో వైయస్‌ఆర్‌ సీపీ కన్వీనర్‌ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి. 
కృష్ణా జిల్లాలో.. 
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రక్షణ నిధి. పామ్రరులో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం. వైయస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనీల్‌కుమార్‌. మచిలీపట్నం కోర్టు సెంటర్‌లో వైయస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన పేర్ని నాని. గుడివాడలో వైయస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. పెడనలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌. 
ప్రకాశం జిల్లా..
జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌కు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మహానేత వైయస్‌ఆర్‌కు ఘన నివాళులు. ఒంగోలు మండలం కొప్పోలు, అల్లూరులో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. గుడ్లూరులో వైయస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన మానుగుంట మహీధర్‌రెడ్డి. 
నెల్లూరు జిల్లా..
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహానేత వైయస్‌ఆర్‌కు ఘన నివాళులర్పించారు. కావలిలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. కందుకూరులో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన తూమాటి మాధవరావు. మార్కాపురంలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వెన్నా హనుమారెడ్డి. కనిగిరిలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన బు్రర మధుసూదన్‌యాదవ్‌. ఉలవపాడులో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన మానుగుంట మహిధర్‌రెడ్డి. దర్శిలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన వెన్నపూస వెంకటరెడ్డి. 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా..
కొల్లాపూర్‌లో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం. వైయస్‌ఆర్‌కు నివాళులర్పించిన వైయస్‌ఆర్‌ సీపీ నేతలు గున్రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి. సిద్దిపేటలో మిర్దొడ్డి మండల కేంద్రంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం. వైయస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన వైయస్‌ఆర్‌ సీపీ నేత అశోక్‌గౌడ్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైయస్‌ఆర్‌ సీపీ నేతల కొల్లు వెంకటరెడ్డి. ఖమ్మంలో వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జి దారెల్లి అశోక్‌ నేతృత్వంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా టీవైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్‌. 
Back to Top