మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా హబీబుల్లా

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా డీఎస్‌ హబీబుల్లాను నియమిస్తున్నట్లు  పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు హబీబుల్లా నియామకం జరిగినట్లు తెలిపింది. డీఎస్‌ హబీబుల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు.

Back to Top