బడుగుల ఆశాజ్యోతి వైఎస్: మేకపాటి

హైదరాబాద్, సెప్టెంబర్ 2: పేద, బడుగు, బలహీన వర్గాల మనసెరిగిన నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, అందుకే ఆయన దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ వర్గాల ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన పథకాలు అమలు చేశారని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. పాలన అంటే ఎలా ఉండాలో, ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి వైఎస్ అని పిసీఏ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ కొనియాడారు.

కుల, మత, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా 'శాచ్యురేషన్' (సంతృప్తస్థాయి) విధానాన్ని సంక్షేమ పథకాల్లో అమలు చేయాడమనేది విప్లవాత్మకమని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, గట్టు రామచంద్రరావు, బి.జనక్ ప్రసాద్, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశ్ తదితరులు మాట్లాడారు. కొణతాల రామకృష్ణ, విజయసాయిరెడ్డితో సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదాన చేశారు. అనాధ విద్యార్దులకు ఆర్థిక సాయం, పుస్తరాల పంపిణీ కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, పుత్తా ప్రతాపరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డ తదితరులు పాల్గొన్నారు.

Back to Top