<br/><br/> అమరావతి: ఏపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ ద్వారా లేని అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 3.72 కోట్ల మంది ఓటర్ల రియల్ టైం డేటా ఓటరు డేటాతో లింకై ఉందని, దాని వల్ల ఓటర్లను ఆర్థికంగా, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రలోభపెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటరు కులం, మతం, సామాజిక స్థాయి, ఉద్యోగం, ఆదాయం, రాజకీయ నేపథ్యం వివరాలతో సహా డేటాను సేకరించారని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. <br/>