నేడు దుడ్డుపాలెంలో గడపగడపకు వైయస్సార్‌

చోడవరం: మండలంలో దుడ్డుపాలెం గ్రామంలో ఈనెల 18వ తేదీన గడపగడపకు వైయస్సార్‌కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పికొండ లింగబాబు, మారిశెట్టి శ్రీకాంత్‌సోమవారం చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 5గంటలకు దుడ్డుపాలెం, డి.బుచ్చెయ్యపేట గ్రామాల్లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొంటారని, మండల నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తరలి రావాలని వారు కోరారు.

Back to Top