దొమ్మేరు వద్ద ముగిసిన పాదయాత్ర

కొవ్వూరు, 03 జూన్ 2013:

దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజప్రస్థానం పాదయాత్ర 168వ రోజు యాత్ర ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద శ్రీమతి షర్మిల రాత్రి బసకు చేరుకున్నారు.  సోమవారం రోజున షర్మిల పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర సాగిందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనా నగరం, పంగిడి, కాపవరం మీదుగా కొవ్వూరు మండలం దొమ్మేరు చేరిందని రఘురామ్ వెల్లడించారు.

Back to Top