టీడీపీ ప్రలోభాలకు లొంగవద్దు

నంద్యాల: ఉప ఎన్నికలో ముస్లిం ఓట్ల కోసం టీడీపీ నాయకులు అనేక ప్రలోభాలు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ముస్లిం సోదరులు వారి మాటలు నమ్మి లొంగవద్దని వైయస్సార్సీపీ మైనార్టీ నాయకుడు హబీబుల్లా పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణంలో హబీబుల్లా మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడున్నర సంత్సరాలు దాటుతున్నా ఇంత వరకు ముస్లింల కోసం ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని ప్రశ్నించారు. కేబినెట్‌లో మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబునాయుడు నేడు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం ఓటర్ల కోసం ఫరూక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలు అభివృద్ధి చెందారన్నారు. నాలుగుశాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకం ఇలా ఎన్నో పథకాలు చేపట్టి వైయస్సార్‌ అందరి గుండెల్లో నిలిచి పోయారన్నారు. ఉప ఎన్నికలో ఓట్ల కోసం ముస్లింలకు లేనిపోని హామీలు టీడీపీ నాయకులు ఇస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. 2019లో జరిగే జరిగే సాధారణ ఎన్నికలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూసుకోవాలంటే ఈ ఎన్నికలో వైయస్సార్సీపీ పార్టీని గెలిపించుకోవాలన్నారు.

Back to Top