మహానేతపై విమర్శలు తగదు

తిరుపతి 19 జూలై 2013:

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రెహ్మాన్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సిండికేట్లకు నాయకత్వం వహిస్తున్న ఆయన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించడం తగదన్నారు.  బొత్స ఎక్కడ పర్యటించినా  తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని రెహ్మాన్ తెలిపారు. ముస్లింల సంక్షేమానికి గతంలో డాక్టర్ వైయస్ఆర్  ఎన్నో చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. నేడు అలాంటి నాయకులు కరవయ్యారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని రెహ్మాన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Back to Top