విష ప్రచారానికి పుత్రులు

హైదరాబాద్ః ఈడీ అటాచ్ మెంట్ ను సాకుగా తీసుకొని టీడీపీ నేతలు వైయస్సార్సీపీపై  దాడి చేయడం దుర్మార్గమని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.  వైయస్సార్సీపీ మూతబడుతోందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారంపై ఆమె ఆగ్రహించారు. చట్టపరంగా జరుగుతున్న విషయాలను అబద్ధాలు, అవాస్తవాలతో ప్రచారం చేయడం దారుణమన్నారు. నేరమైన వ్యవహారాలన్నీ టీడీపీ నేతలు చేస్తూ వైయస్ జగన్ ను దోషి అని మాట్లాడడం విడ్డూరమన్నారు. 

కాంగ్రెస్, టీడీపీలు చేసిన కుట్రల వల్లే వైయస్ జగన్ పై పిటిషన్ లు, సీబీఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయన్నారు. ఛార్జిషీట్ లకు సంబంధించిన దానిపై విచారణ జరుగుతుండగానే, టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. విషప్రచారానికి టీడీపీ నేతలు పుత్రులని పద్మ దుయ్యబట్టారు. వైయస్ జగన్ ను నేరుగా ఎదుర్కోలేక,  ప్రతీ సారి ఆయన్ను టార్గెట్ చేస్తూ.... ప్రజలనుంచి దూరం చేయాలన్న దాంట్లోనే టీడీపీ నేతల ఫెయిల్యూర్ కనబడుతుందన్నారు. 
Back to Top