డెల్టా ఆధునికీకరణ నిలిచిపోవడమే కారణం

శివకోడు(తూర్పు గోదావరి జిల్లా):

వరదలతో డెల్టాలో రైతులు కష్టాల్లో ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్క్షురాలు వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె తూర్పుగోదావరి జిల్లా శివకోడులో నీట మునిగిన పొలాలను సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్నారు. ఎకరానికి రూ. పది నుంచి పదిహేడు వేలు సాయం చేసేలా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ. 200 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.  ఇరవై శాతం పనులు పూర్తయ్యాయి. తదుపరి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  వరద, పంట నష్ట పరిహారంపై అసెంబ్లీలో చర్చించేలా చూస్తామని తెలిపారు.

Back to Top