రాజకీయ, సినీరంగంలో దాసరి ప్రముఖ పాత్ర

గుంటూరుః మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు మృతి తీవ్రంగా కలచివేసిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకు 1989 నుంచి మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు. రాజకీయాలు, సినీరంగం రెండింటికీ దాసరి పెద్ద దిక్కుగా ఉన్నారని అంబటి చెప్పారు. రాజకీయ రంగం, చలనచిత్ర రంగం రెండింటిలోనూ ప్రముఖ పాత్ర వహించిన అరుదైన వ్యక్తి దాసరి నారాయణ రావు అని అన్నారు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బాధతప్త హృదయంతో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top