పంట‌లు ఎండిపోతున్నాయ్‌...నీరిచ్చి ఆదుకోండి

స‌ర్వేప‌ల్లి: మ‌నుబోలు మండ‌లంలో సాగులో ఉన్న వ‌రి పంట ఎండిపోకుండా కండ‌లేరు జ‌లాశ‌యం నుంచి నీరు విడుద‌ల చేయాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ముత్యాల‌రాజుకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. నీరు చాల‌క పంట‌లు ఎండిపోయే దుస్థితికి చేరాయ‌న్నారు. కండ‌లేరు జ‌లాశ‌యం లో లెవ‌ల్ స్లూయీజ్ నుంచి పిన్నేరు వాగు ద్వారా 200 క్యూసెక్కుల నీరు విడుద‌ల చేసేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. 

ఇరిగేష‌న్ అధికారులు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే రైతులు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఒక్క‌రు కూడా ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన క‌లెక్ట‌ర్ ముత్యాల‌రాజు సానుకూలంగా స్పందించార‌ని ఆయ‌న తెలిపారు. నీరు విడుద‌ల చేసి పంట‌ల‌ను కాపాడే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని క‌లెక్టర్ హామీనిచ్చిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఎమ్మెల్యే వెంట వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు జ‌య‌రామిరెడ్డి, నాయ‌కులు ర‌మ‌ణ‌కుమార్ రెడ్డి, రైతులు త‌దిత‌రులున్నారు
Back to Top