ఎన్నికల్లో గెలిచి తీరుతాం

హైదరాబాద్‌: అక్రమమార్గంలో సంపాదించిన సొమ్ముతో చంద్రబాబు ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్లను కొనుగోలు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, వైయస్‌ఆర్‌ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రలోభాలకు తట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నిలబడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువు పాటించే నాయకులు మా పార్టీలో ఉన్నారని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తప్పకుండా వైయస్‌ఆర్‌ జిల్లా ప్రతిష్టను కాపాడుకుంటామన్నారు. 

Back to Top