కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు

జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపును సీమాంధ్ర రైతులు అందుకున్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కదంతొక్కుతూ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రప్రదేశే తమ నినాదమని వారంతా ఎలుగెత్తి చాటారు.

నగరి (చిత్తూరు జిల్లా) :

ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన ద్రోహులని వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యురాలు ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజా నేతృత్వంలో  బుధవారం రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆమె కిరణ్ కుమా‌ర్‌రెడ్డి, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. కిరణ్ కుమా‌ర్‌రెడ్డి, చంద్రబాబు తెర వెనుక సమైక్యవాదాన్ని వినిపిస్తూ రాష్ట్ర విభజన విషయంలో యూపీఎ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని రోజా మండిపడ్డారు.

సమైక్యాంధ్ర కోసం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని రోజా చెప్పారు. శ్రీ జగన్ ఇప్పటికే ‌జాతీయ, స్థానిక స్థాయిలో అనేక పార్టీల మద్దతు కూడగట్టారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం శ్రీ‌ వైయస్ జగన్ వల్లే సాధ్యమని రోజా స్పష్టం చేశారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపుతో బుధవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ట్రాక్టర్లను రోడ్లపైకి తీసుకు వచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి, నగరి నియోజకరవర్గం సమన్వయకర్త ఆర్కే రోజా నాయకత్వంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నగరిలోని సత్రవాడ నుంచి ఓం శక్తి కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ‌రోజా స్వయంగా ట్రాక్టర్ నడిపారు.

మదనపల్లి చీకులపేటలో ఎమ్మెల్సీ దేశా‌యి తిప్పారెడ్డి ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. మదనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త షమీమ్ అస్లాం నిమ్మనపల్లిలో ట్రాక్ట‌ర్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్‌ మనోహర్ అధ్వర్యంలో రూర‌ల్ మండలంలోని ఎన్‌ఆ‌ర్‌ పేట నుంచి చిత్తూరులోని గాంధీ విగ్రహం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాయకత్వంలో చిత్తూరు-నేండ్రగుంట మార్గంలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. ‌రైతులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపివేసి ఆందోళన చేశారు. ఆయనతో పాటు పాకాల మండల కన్వీనర్ చెన్నకేశవరెడ్డి, గోవిందరెడ్డి, కేశవులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగలో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం ‌ఆధ్వర్యంలో ట్రాక్ట‌ర్ ర్యాలీ జరిగింది. స్థానిక చెంగాలమ్మ గుడి నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో మండల కన్వీన‌‌ర్ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి నాయకత్వంలో బైపా‌స్ రోడ్డులోని షాదీ మహ‌ల్ నుంచి చెరువుకట్ట వరకు ట్రాక్ట‌ర్ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్కూటర్లు, ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. మండల కన్వీన‌ర్ సురే‌శ్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోవిందరెడ్డి, ఆంజనేయులు ర్యాలీని విజయవంతం చేశారు. పలమనేరులో వై‌యస్‌ఆర్‌సీపీ రిలే నిరాహార దీక్షలు జరిగాయి. తిరుపతిలో జరిగిన వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ రిలే నిరాహారదీక్షలో మహిళా విభాగం నేత కుసుమ ఆధ్వర్యంలో పలువురు పాల్గొన్నారు.

కొనసాగుతున్న నిరసనలు :
శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు కల్యాణ మండపం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ నాయకుడు వరదారెడ్డి నాయకత్వంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మదనపల్లిలో సమైక్య జేఏసీ నేతలు మల్లికార్జున సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Back to Top