దోచుకున్నది దాచుకునేందుకు బాబు విదేశీ యాత్రలు


ప్రకాశం: రాష్ట్రంలో దోచుకున్న నల్లధనాన్ని దాచుకునేందుకు చంద్రబాబు విదేశీ యాత్రలు చేస్తున్నారని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. చీరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలు వస్తాయని పెట్టుబడుల కోసం నెలకోసారి విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో ఏపీకి ఒక్క ప్రాజెక్టు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని విదేశీ బ్యాంకుల్లో దాచుకునేందుకు విదేశీయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న ఏకైనా నాయకుడన్నారు. దశలవారీగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక ఉద్యమాలు చేశారన్నారు. కేంద్రంపై టీడీపీ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని నిలదీశారు. మహానేత ఆశయాలను సజీవంగా బతికించేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, జననేతకు అందరం మద్దతుగా నిలబడాలని కోరారు.
Back to Top