చేనేతలంతా వైయస్ జగన్ వెంటే

విజయవాడః వైయస్ జగన్ ధర్మవరం పర్యటనతో ప్రభుత్వంలో కలవరం మొదలైందని వైయస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు అన్నారు. చేనేతలకు ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. వైయస్ జగన్ చేనేతలకు ఇచ్చిన హామీలపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. లక్షలాది మంది చేనేతల జీవితాల్లో వెలుగులు నింపే ప్రణాళికను వైయస్ జగన్ ప్రకటించారని చెప్పారు. చేనేతలంతా వైయస్ జగన్ వెంటే ఉన్నారని,   రాబోయే కాలంలో వైయస్ జగన్ ను గెలిపించుకుంటామని బడుగు బలహీన వర్గాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని చిల్లపల్లి అన్నారు. చేనేత కార్మికులు ఆకలి చావులతో అలమటిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Back to Top