రాజధానిలో బాబు రూ. లక్ష కోట్ల కుంభకోణం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో లక్ష కోట్ల భూ కుంభకోణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరలేపారని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...అమరావతి సమీప గ్రామాల్లో జరుగుతున్న భూ కుంభకోణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూనే ఉందని గుర్తు చేశారు. 

బాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. ఏపీ అంతా అవినీతిమయం చేసి ఆ డబ్బుతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం అపహాస్యం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు
Back to Top