చంద్రబాబుది బ్లాక్ మెయిల్ విధానాలు-అంబటి రాంబాబు

హైదరాబాద్) కాపుల
విషయంలో చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్ విధానాలు అవలంబిస్తున్నారని వైయస్సార్సీపీ
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని
చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాట తప్పి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాపుల్ని
ఆదరించినందున వైయస్సార్ దైవంగా మిగిలారని, మోసాలు చేస్తున్నందునే చంద్రబాబుని
దయ్యంగా భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే చంద్రబాబు భారీ
మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

 

Back to Top