చంద్రబాబు పదవి నుంచి దిగిపో

పశ్చిమగోదావరి(ఆకివీడు): ‘అవినీతి, అసమర్థ, అక్రమ పాలన సాగిస్తున్న చంద్రబాబు పదవి నుంచి దిగిపోవాలని  గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోథులు, సర్వోదయ సంఘ ప్రధాన కార్యదర్శి పత్తి శేషయ్య డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహిస్తూ బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజ్యసభ సభ్యుల ఎంపిక వంటి వాటితో పాటు డబ్బుతో రాజకీయాన్ని ముడిపెట్టడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు బలమైన ప్రతిపక్షం ఉండాలన్నారు. అయితే ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజలు మనవైపే ఉండాలని బాబు ఆలోచన చేయడం  అవివేకమన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

Back to Top