చంద్రబాబు దళిత వ్యతిరేకి

గుంటూరుః చంద్రబాబు దళితులపై వివక్ష చూపుతున్నాడని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు.  రాష్ట్రంలో స్కూళ్లు, హాస్టళ్లు మూసేస్తే దళితులు, గిరిజనులు ఎలా చదువుకుంటారు బాబు అని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో దళితులకు ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చావా బాబు అని నిలదీశారు. దళితుల భూములను దోచుకొని సింగపూర్ వాళ్లకు కట్టబెడుతున్నావంటూ బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మేరుగు ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

Back to Top