చంద్ర‌బాబు కాదు మందుబాబు

బాబు రాష్ట్రంలో మ‌ద్యాన్ని ఏరులై పారిస్తున్నారు
ప్రజలను దోచుకోవడమే బాబు విజన్ 20
మద్యం ఉత్పత్తిలో ఏపీని నంబర్ 1 చేయాలని చూస్తున్నాడు
ఎన్టీఆర్ సుజల స్రవంతి అన్నాడు.. చుక్కనీరివ్వడం లేదు
కానీ నారావారి సారా స్రవంతి మాత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు

హైదరాబాద్ః మ‌ద్యం ఉత్ప‌త్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే నంబ‌ర్ 1 చేయ‌డానికి బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు మండిపడ్డారు. ప్ర‌తీ ఇంటికి రూ. 2 తో 20 లీట‌ర్ల మంచినీళ్ల‌ను ఎన్టీయ‌ార్ సుజ‌ల‌స్ర‌వంతి ద్వారా అందిస్తామ‌ని చెప్పిన బాబు....   రెండు చుక్క‌ల నీరు కూడా అందించ‌డం లేద‌ని అంబటి ఫైరయ్యారు. ఆపథకం ఎక్కడపోయిది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  . హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏమన్నారంటే....

 • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని చంద్ర‌బాబు అవినీతి రాష్ట్రంగా మార్చార‌ు.
 • ఎన్టీఆర్ సుజ‌ల‌స్ర‌వంతి సంగతి దేవుడెరుగు ... నారా వారి సారా స‌వ్రంతి మాత్రం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది.
 • మ‌ద్యం తాగ‌ాల‌నుకునే వారికి ఎక్కడా లోటు రాకుండా టీడీపీ పుష్క‌లంగా మ‌ద్యం అందించే కార్య‌క్ర‌మం చేస్తుంది.
 • 8.78 కోట్ల ఫ్రూఫ్ లీట‌ర్ల మ‌ద్యాన్ని ప్రైవేట్ రంగంలో ఉత్ప‌త్తి చేయాల‌ని బాబు ఒక జీవోను విడుద‌ల చేశార‌ు.
 • మళ్లీ కొత్త‌గా 1,489 ల‌క్ష‌ల ఫ్రూఫ్ లీట‌ర్ల‌ మ‌ద్యం ఉత్ప‌త్తికి అనుమ‌తుల‌ను మంజూరు చేస్తూ మ‌రో జీవోను విడుద‌ల చేశారు.
 • మ‌ద్యం వినియోగం త‌గ్గిస్తాం... ప్ర‌తి ఊర్లో డీ ఎడిక్ష‌న్ సెంట‌ర్లు పెడ‌తాం... ద‌శ‌ల వారీగా మ‌ద్యాన్ని నిషేదిస్తామ‌న్న బాబు హామీ ఏమైంది.
 • హైవే పక్క‌న మ‌ద్యం దుకాణాలు ఉంటే డ్రైవ‌ర్లు మ‌ద్యం సేవించి ప్ర‌మాదాల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అక్కడ దుకాణాలు ఉండొద్ద‌ని గ‌త ప్ర‌భుత్వాలు జీవోల‌ను విడుద‌ల చేశాయి. 
 • చంద్ర‌బాబు వ‌చ్చిన త‌ర్వాత హైవేలు అయిన ప‌ర్వాలేదు... మ‌ద్యం దుక‌ణాల‌ను ప్రారంభించండి అని అధికారుల‌కు చెప్ప‌డ‌మే కాకుండా టేట్రాప్యాక్‌ల‌ను తీసుకురావ‌డం సిగ్గు చేటు. 
 • ప్ర‌జ‌ల‌ను మ‌ద్యానికి బానిస  చేసేటువంటి కార్య‌క్ర‌మాల‌ను త్వ‌రిత‌గ‌తిన అమ‌లు చేయ‌డంతో చంద్ర‌బాబు నంబ‌ర్‌ వన్ స్థానంలో ఉన్నాడు. 
 • మ‌ద్యం వ‌ల్లే కుటుంబాలు చిన్న‌భిన్నం అవుతున్నాయ‌ని... తాను అధికారంలోకి రాగానే బెల్టు షాపుల‌ను పూర్తిస్థాయిలో ర‌ద్దు చేస్తాన‌ని చంద్ర‌బాబు త‌న పాద‌యాత్ర‌లోప్ర‌గాల్భాలు ప‌లికారు.
 • బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీలో ఏ ఒక్క చోటైనా మ‌ద్యం దుకాణాల‌ను ర‌ద్దు చేశారా .
 • ర‌ద్దు చేయ‌క‌పోగా నూత‌న మ‌ద్యం దుకాణాల‌కు లైసెన్సులు జారీ చేస్తూ ఏపీలో మ‌ద్యాన్నిఏరులై పారిస్తున్నారు. 
 • కేవ‌లం క‌మిష‌న్ల కోసమే ప‌ట్టిసీమ‌, మ‌ద్యం ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మాలు 
 • ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతిని ముంచేశారు.... క‌మిష‌న్లు ఇస్తే త‌ప్ప ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి ప్రారంభం కాద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది
 • రెక్క‌ాడితే గానీ డొక్క‌ాడ‌ని వారిని దోచుకునేందుకే బాబు విజ‌న్-20.
 • మ‌ద్యాన్ని విప‌రీతంగా తాగించ‌డం, క‌ల్తీ మ‌ద్యం విక్ర‌యాలు చేయించ‌డ‌మే విజ‌న్‌-20 అని ఆరోపించారు.
 • రాష్ట్రంలో ఇలాగే మ‌ద్యాన్ని కొన‌సాగిస్తే ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బ‌దులు మందు బాబు అని పిలుస్తార‌ు. 
 • మంత్రి నారాయ‌ణ కోసం ప్ర‌భుత్వ విద్యాల‌యాలు మూయించేశారు.
 •  చైనా వారి కోసం దేవాల‌యాలు కూల్చారు.
 • క‌మిష‌న్ల కోసం మ‌ద్యాన్ని పెంచి పోషించి కాపురాల‌ను కూల్చొద్దని బాబును డిమాండ్ చేస్తున్నాం. 
 • గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల స్పందన మ‌హోద్యమంగా ఉంది. 
Back to Top