చంద్ర‌బాబుది రెండు నాలుక‌లు-జ‌క్కంపూడి

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం)) ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుది రెండు నాలుక‌ల ప‌ద్ధ‌తి అని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమవారికో రూలు.. ప్రజలకో రూలు అన్నవిధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.  తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. 
ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా విజయవాడలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నిరంకుశంగా తొలగించిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు, ఆచార, సంప్రదాయాలకు విరుద్ధంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో 15 అడుగుల ఎత్తున రూపొందించిన శ్రీకష్ణుడి వేషంలోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం నెలకొల్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Back to Top