చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకెళుదాం

– అన్న వస్తున్నాడు త్వరలో మంచిరోజులు రానున్నాయి
సుండుపల్లి: ఎన్నికలముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కారని, బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  సుండుపల్లిలో రెడ్డివారిపల్లి వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆనందరెడ్డి స్వగృహంలో బూత్‌స్థాయి కన్వీనర్లతో ఆకేపాటి అమర్‌నాద్‌రెడ్డి సమావేశమయ్యారు. గద్దెనెక్కేందుకు మోసపూరిత వాగ్దానాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, ఆరోగ్యశ్రీ అమలు, ప్రత్యేకహోదా, అసైన్‌డ్‌ భూములు ఇస్తానని చెప్పి ఏ ఒక్కటి చేసిన దాఖలాలు లేవని రైతులపాలిట నయవంచుకుడు చంద్రబాబు అన్నారు.

పాత్రికేయులతో మాట్లాడుతూ: 11వ తేదీనుంచి వైయస్సార్‌కుటుంబం కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభంకాగా మొదటిరోజు 4లక్షలమంది చేరారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమై నవతర్నాలు, వైయస్సార్‌ సంక్షేమపథకాలు ఆయన స్వర్ణయుగం, అర్హులందరికీ పింఛన్లు వాటిగురించి తెలియపరిచి మిస్స్‌డ్‌కాల్‌ కార్యక్రమంతో వైయస్సార్‌ కుటుంబంలోకి చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజల్లో మంచిస్పందన ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, అజంతమ్మ, హాకింసాబ్, మధుసూధన్‌నాయుడు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top