చంద్రబాబు విచ్చలవిడి అవినీతి

హైదరాబాద్ః బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోవడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అంతా తాత్కాలికం అంటూ ప్రభుత్వం చేస్తున్న తంతంగం చూస్తోంటే బాధేస్తుందన్నారు.  రాష్ట్రాన్ని దోచుకునేందుకే బాబు హైదరాబాద్ నుంచి హడావిడిగా విజయవాడకు తరలిపోయారని ఎద్దేవా చేశారు. బాబు, లోకేష్, మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. బాబు అక్రమాలను, అన్యాయాలను నిలదీస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై పోలీసులను ఉసిగొల్పి అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Back to Top