చంద్రబాబు అన్ని రకాలుగా మోసం చేశారు

గంగాధర నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మహిళలతో మాట్లాడుతూ.. దేవుడు, ప్రజల ఆశీర్వాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించడం జరిగింది. నవరత్నాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని, పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు చదువుతేనే మన తలరాతలు మారుతాయనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా పెన్షన్‌ రూ. 2 వేలు చేస్తామని, పెన్షన్‌ వయస్సు 45 ఏళ్లకు తగ్గించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. పొదుపు సంఘాల రుణాలు కూడా నేరుగా మహిళల చేతికి నాలుగు దఫాలుగా అందజేస్తామని చెప్పారు. వయస్సు కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి ఆశీర్వదించాలని మహిళలను కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top