చంద్రశేఖర్ దంపతులకు అండగా ఉంటాం

హైదరాబాద్, 4 డిసెంబర్ 2012:

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సకాలంలో స్పందించి ఉంటే చంద్రశేఖర్ దంపతులకు న్యాయం జరిగేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై వింగ్ కన్వీనర్ వెంకట్ మేడపాటి అన్నారు. చంద్రశేఖర్ దంపతుల విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన తీరు దారుణంగా ఉందన్నారు. నార్వే కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ మద్దతును కూడగడుతున్నామని వెంకట్ మేడపాటి తెలిపారు.

Back to Top