చంద్రబాబు మరి కొన్నాళ్ళు సీఎంగా ఉండుంటే...

ఐజ:

ప్రభుత్వ రంగ సంస్థలకు కాపలాదారుగా ఉండాల్సిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్కొక్క సంస్థనూ ప్రైవేటీకరిస్తూ వచ్చారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తెలిసారు. మహబూబ్‌గర్ జిల్లా ఐజలో ఆదివారం రాత్రి ఏర్పటుచేసిన బహిరంగా సభలో ఆమె మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆయన గ్రామాలను శ్మశానాలుగా మార్చారన్నారు. వైయస్ఆర్ పథకాలను అమలు చేస్తానంటూ  ఇప్పుడు కొత్త అబద్ధాలాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే  అవిశ్వాసం మాత్రం పెట్టనంటున్నారని తెలిపారు. ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారంనాటికి 39రోజులు పూర్తయ్యింది. ఇంతవరకూ ఆమె  522.90 కిలోమీటర్లు నడిచారు. తొంబై రోజులు రిమాండ్ దాటితే బెయిలు ఇవ్వాలన్న నిబంధనను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ వారు సీబీఐను ఉపయోగించుకుని కుట్ర చేసి జగనన్నను జైలులోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రబాబు మరికొద్ది రోజులు పదివిలో ఉండుంటే  వేలాది మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడేవన్నారు.   కొంత మంది తెలంగాణ సెంటిమెంటును అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, విద్యార్థులను, యువకులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. సొమ్ము సంపాదించడం కోసమే వారు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లావాసులు త్యాగమూర్తులని రాజన్న చెప్పేవారు


     పాలమూరు జిల్లా వాసులు త్యాగమూర్తులని తన తండ్రి రాజన్న ఎప్పుడూ చెప్పే వారన్నారు. ఇది కరవు జిల్లా అనీ,  పంటలు సరిగా పండవనీ, కూలీ చేద్దామన్నా దొరకదనీ చెప్పారన్నారు. 'ఈ జిల్లా అన్నదమ్ములు కుటుంబం కోసం ఎక్కడెక్కడికో వలసలు పోయి అక్కడ వాళ్లు తిన్నా, తినకపోయినా నాలుగు డబ్బులు వెనుకేసుకొని వాళ్ల కుటుంబాలకు పంపుతారమ్మా. ఈ జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు కానీ ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదు. జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 8 లక్షల ఎకరాలకు నీళ్లు అంది జిల్లా సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు నా అన్నాదమ్ములు వలసలు మానేసి వాళ్ల కుటుం బాలతో సంతోషంగా ఉంటారు’ అని తన తండ్రి  చెప్పేవారని షర్మిల గుర్తుచేసుకున్నారు. ‘మహానేత కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 75 శాతం పనులు పూర్తి చేశారన్నారు. మరో 25 శాతం పనులు పూర్తి చేస్తే ఈ జిల్లా సస్యశ్యామలయయ్యేదన్నారు. కాంగ్రెస్ పాలకులు మూడేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టుల పనులను పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారని ఆరోపించారు. మాట వరసకు ముఖ్యమంత్రి వచ్చి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను ప్రారంభించి వెళ్ళారనీ ఇంతవరకూ చుక్క నీరు పొలాల్లోకి పారలేదనీ ఆమె తెలిపారు. నేను దారి వెంట నడుస్తుంటే అక్కా చెల్లెమ్మలు కలుస్తున్నారు. ‘మాకు సాగునీళ్ల సంగతి దేవుడెరుగు కనీసం తాగు నీళ్లు కూడా లేవ క్కా’ అని బాధపడుతున్నారు. ప్రజలకు కనీసం తాగే నీళ్లు కూడా అందించలేని ఈ ప్రభుత్వం ఉండటం అవసరమంటారా?’’ అని షర్మిల ఉద్వేగంగా ప్రశ్నించారు.

Back to Top