ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపు

టెక్కలి: ప్రభుత్వ వైఫల్యాలు, అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు ఈ నెల 28న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వైయస్సార్‌సీపీ ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా ప్లీనరీకి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిలక్‌ మాట్లాడుతూ అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలను అందజేసి సామాన్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.జానకిరామయ్య, ఎన్‌.శ్రీరామ్మూర్తి, కె.నారాయణమూర్తి, సత్తారు సత్యం, టి.కిరణ్‌ ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top