బాబు రాజకీయాలకే అరిష్ఠం

  • పరమన నీచ, నికృష్ట చరిత్ర చంద్రబాబుది
  • వంగవీటి రంగాను చంపించిన కుట్రదారుడు
  • ఎన్టీఆర్, పరిటాల రవిల చావుకు కారణమయ్యాడు
  • నమ్మిన వాళ్ల గొంతు కోయడం బాబు నైజం
  • వైయస్ఆర్, జగన్ ల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు
  • వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
నంద్యాలః రాజకీయాలను భ్రష్టుపట్టించిన నీచ నికృష్టుడు చంద్రబాబు అని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బాబు రాజకీయాలకే అరిష్టమని విమర్శించారు. మహనీయులు నడియాడిన అసెంబ్లీలో చంద్రబాబు నెలకొల్పిన నీచాతి నీచ సంప్రదాయాల కారణణంగా ఏపీ రాజకీయాలే భ్రష్టుపట్టాయని పైర్ అయ్యారు.  నమ్మిన వాళ్ల గొంతు కోస్తాడని నిరూపించిన పరమనికృష్టుడు చంద్రబాబు తప్ప మరొక్కరు లేరని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ చెప్పారని భూమన గుర్తు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూమన ఇంకా ఏమన్నారంటే....

కాపు ఉద్యమ నాయకుడు వంగవీటి రంగా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అత్యంత పాశవికంగా, ఘోరాతి ఘోరంగా నడివీధిలో నరికి చంపిన కుట్రదారుడు చంద్రబాబు అని  అప్పటి క్యాబినెట్ లో మంత్రి అయిన హరిరామయ్య జోగయ్య పుస్తకం రాశాడు. బాబు నమ్మినవాళ్ల గొంతు కోయడానికి ఏమాత్రం వెనుకాడడని ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్ర చెబుతోంది.  నా మీద నక్సలైట్ల దాడి జరిగితే గంగిరెడ్డిని పదేపదే కలవాలని వైయస్ఆర్ ప్రయత్నం చేశాడని, సానుభూతి కోసం నిరాహార దీక్ష చేశాడని బాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. సభ్యసమాజంలో హింసాయుత రాజకీయాలకు చొరవ ఉండకూడదని, నక్సలైట్ల చర్య ఉన్మాద చర్య అని తిరుపతిలో గాంధీ బొమ్మ దగ్గర నిరసన దీక్ష చేయడమే గాకుండా దెబ్బతిన్న నిన్ను  పరామర్శించింది మర్చిపోయిావా బాబూ..? వైయస్ఆర్ నీకు చేసిన మానవత్వాన్ని గుర్తుంచుకోవాల్సిందిపోయి... నాపై జరిగిన దాడిలో రాజశేఖర్ రెడ్డి హస్తం ఉందని చెబుతున్నావంటే నీవు నీచాతి నీచుడివో, పరమ నికృష్టిడివో అర్థమవుతోంది. అధికారం కోసం, నీ స్వార్థానికి రాజకీయాలను ఉపయోగించుకున్నావే తప్ప ఏనాడైనా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చేశావా బాబూ..? రాజకీయాల్లో నీవు అడుగుపెట్టిన ప్రతిక్షణం నుంచి అవకాశ వాద రాజకీయాలతో అందినకాడికి కాళ్లు పట్టుకోవడం,  లొంగిపోయాక తలలు నరకడమే రాజకీయ పునాదిగా ఎదిగిన నీవా మాగురించి మాట్లాడేది. 

ఎన్టీఆర్ అభిమాని అయిన మల్లెల బాబ్జి రామారావు మీద హత్యానాటకానికి నీవు ఉసిగొల్పిన విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత బాబ్జి ఆత్మహత్యకు కారణమయ్యావ్. అలాంటి నీచ చరిత్ర నీది.  మీ వియ్యంకుడు బాలకృష్ణ ఇంటిలో సెక్యూరిటీని హత్య చేశారని ఆరోపణ వస్తే చట్టం తన పని చేసుకుపోతుందని, ప్రత్యర్థుల మీద రాజకీయం చేయనని చెప్పిన మహానుభావుడు వైయస్ఆర్. పరిటాల రవి హత్య సహా నీవు అనేక ఆరోపణలు చేస్తే సీబీఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిగ్గు తేల్చిన ఘన చరిత్ర వైయస్ఆర్ ది.  పరిటాల రవి హత్య కేసులో చార్జిషీటులో పేరున్న జేసీని టీడీపీలో చేర్చుకొని అధికార మద రాజకీయాలు చేసిన నీచ సంస్కృతి  నీది. నీవా మాగురించి మాట్లాడేది. అధికారం కోసం కాదు..ప్రజాసంక్షేమం కోసం విలువలు కాపాడని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జగన్. ఆయనపై నీచ ఆరోపణలు చేస్తున్నారు. రాజారెడ్డి మీద నీవు నీ తాబేదారులు చేస్తున్న విమర్శలు. పరిటాల రవీంద్ర గాయపడినప్పుడు వచ్చి పరామర్శించిన మానవతావాది రాజారెడ్డి. సాక్షినే నేనే.  ఆ సంఘటనను మీలాగ మేం ప్రచారం చేసుకోలేదు. 

 వైయస్ఆర్ హయాంలో వైయస్ జగన్ ఏనాడు కూడ పాలనలో తలదూర్చలేదు. ఏనాడు హైదరాబాద్ వైపు కూడ రాని జగన్ మీద నీవు ఎన్ని విమర్శలు చేసినా వాస్తవం మరుగున పడే అవకాశం లేదు. నీ తమ్ముడు  రామ్మూర్తి నాయుడు నీవు ఎంత ఘోరంగా తిట్టావో ఆయన చెప్పిన మాయలు నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అలిపిరి బాంబు దాడిలో నీవు గాయపడ్డాక నిన్ను పరామర్శించేందుకు మానవత్వంతో వచ్చిన రామ్మూర్తి నాయుడును నీవు  ఏవిధంగా బండబూతులు తిట్టావో ఇంకా నాచెవిలో తిరుగుతూనే ఉన్నాయి. అమ్మ పదప్రయోగం చేశావ్ నీ సొంత తమ్ముడి మీద. ఆ తర్వాత ఆ బాధను కూడ దిగమింగి.... నీవు తిరుపతి కొండకు దేవుడి దర్శనానికి వస్తే రామ్మూర్తినాయుడు వచ్చి అబిషేక సేవలో పాల్గొన్నాడు. నీ గురించి చెబితే ఓ తల్లి కొడుకున ఇంత దుర్మార్గుడు జన్మించాడా అని భావించాల్సి వస్తుంది. నీచమైన మాటలు మాట్లాడావ్. పరిటాల రవి ఎదుగుదలను ఓర్వలేక హత్యకి కారణభూతుడవైన నీవు జగన్ మీద హత్యారోపణ మోపి చలికాచుకుంటే నమ్మేవారెవరూ లేరు. అనంతపురంలో 450పైగా ఊచకోత కోయించావ్. నంద్యాల సభలో రంగా కొడుకు రాధా మా తండ్రిని చంపిన హంతకుడు బాబేనని చెప్పిన మాట మర్చిపోయావా బాబు. నిన్ను చూసి రాజకీయాలే తలదించుకుంటున్నాయి. మా పార్టీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలన్న విలువలను, సంప్రదాయాన్ని నెలకొల్పిన దీరోదాత్తుడు జగన్. నీలాంటి పరమనీచుడితో పోటీ పడాల్సిన దుర్గతి మా నాయకుడికి పట్టడం మా ఖర్మ అని భూమన బాబుపై నిప్పులు చెరిగారు. 

Back to Top