బుధవారంనాటి మరో ప్రజా ప్రస్థానమిలా...

గురజాల 27 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమ సమన్వయకర్త  తలశిల రఘురామ్ తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి పేటకన్నెగండ్లకు చేరుకుని అక్కడినుంచి 3.7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. భోజనానంతరం గురజాల నియోజకవర్గంలోని జూలకల్లు, గుత్తికొండ క్రాస్‌రోడ్, పందిరివారిపాలెం మీదుగా రాత్రి బస కేంద్రానికి చేరుకుంటారని వివరించారు.

Back to Top