చంద్రబాబు బ్లాక్ మనీకి బ్రాండ్ అంబాసిడర్

హైదరాబాద్ః బాబు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. బ్లాక్ మనీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రోజా దుయ్యబట్టారు. ఇండియన్స్ ను గాడిదలతో పోల్చిన బాబుకు  తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశద్రోహానికి పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో పుట్టినందుకు అందరూ సిగ్గుపడాలన్నారు. బాబు మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ట్రీట్ మెంట్ చేయిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కన్నవారిని, దేశాన్ని ప్రేమించలేని వ్యక్తి ఇక తెలుగు ప్రజలకు ఏం చేస్తాడని బాబుపై నిప్పులు చెరిగారు.

Back to Top