చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి


వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్‌

తూర్పుగోదావరి: చంద్రబాబుపై పోలీస్‌ వ్యవస్థ కేసులు పెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా విద్యార్థి విభాగం నేతలు మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలు, యువభేరీలు, బంద్‌ల్లో పాల్గొన్న విద్యార్థులపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టించారన్నారు. మరి ఇప్పుడు తన స్వార్థప్రయోజనాల కోసం హోదా గళమెత్తి పోరాడుతున్నట్లు ఫోజులు ఇస్తున్న చంద్రబాబుపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద నాటకారి అని, పార్లమెంట్‌ సాక్షిగా బాబు వంచన బట్టబయలైందన్నారు. 24న రాష్ట్ర బంద్‌కు వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారని, బంద్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు
Back to Top