వైయస్‌ఆర్‌సీపీలోకి బీజేపీ నేత ఇందకూరి రఘురాజు

విశాఖ జిల్లాః జననేత వైయస్‌ జగన్‌ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల ఆకర్షితులై వైయస్‌ఆర్‌పీసీలోకి రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా  విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు  చెందిన బీజేపీ నాయకులు ఇందుకూరి రఘురాజు, ముఖ్యనేతలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. 500 మందితో  బైక్‌ర్యాలీగా వచ్చి పార్టీలోకి చేరడం విశేషం. నేతలకు వైయస్‌ జగన్‌ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.వైయస్‌ జగన్‌నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేస్తామన్నారు.

వైయస్‌ఆర్‌సీపీలోకి ప్రముఖ వైద్యులు పైడి వెంకటరమణ
విశాఖ జిల్లా: విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు, కళా ఆసుప్రతి అ«ధినేత  డా.పైడి వెంకటరమణ మూర్తి వైయస్‌ జగన్‌ సమక్షంలో  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న రాజ్యం తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు. జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయసాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తామన్నారు.

 


Back to Top