గౌరవ అధ్యక్షురాలికి శుభాకాంక్షలు

హైదరాబాద్) వైఎస్సార్సీపీ
గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 60 వసంతాలు పూర్తి చేసుకొన్న వైఎస్
విజయమ్మను కలిసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలు చెబుతున్నారు.

1956 లో ఏప్రిల్ నెల 19న
జన్మించిన వైఎస్ విజయమ్మ స్వగ్రామంలోనే చదువును పూర్తి చేశారు. తర్వాత 1972 వ
సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో వివాహం
అయ్యాక పులివెందులలో ఎడుగూరి సందింటి కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టారు. అప్పటి
నుంచి అత్తింటి వారి గౌరవాన్ని పెంచే విధంగా మెలగుతూ వచ్చారు. ప్రజల కోసం
జీవితాన్ని అంకితం చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగిగా .. కష్ట
నష్టాలు, సుఖ సంతోషాలు పాలు పంచుకొంటూ వచ్చారు. జీవితంలో ఏ నాడూ తనను
విసుక్కోలేదని వైఎస్సార్ స్వయంగా ఆమెకు కితాబు ఇచ్చారు.

దివంగత మహానేత మరణం తర్వాత
వైఎస్ విజయమ్మ రాజకీయం ప్రవేశం చేయాల్సి వచ్చింది. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడినందుకు గాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీ తరపున  తిరిగి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ జగన్ ను కేసుల్లో
ఇరికించిన పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షురాలిగా, శాసనసభ పక్ష నాయకురాలిగా బాధ్యతలు
స్వీకరించారు. పార్టీని ఆమె ముందుక నడిపించారు. ప్రజలకు సంబంధించిన అనేక అంశాల మీద
ఆమె పోరాటాన్ని సాగించారు.

పార్టీ కార్యాలయం, వైఎస్
జగన్ నివాసానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలు, నాయకుల్ని ఆమె అభిమానంగా
చూస్తుంటారు. వైఎస్సార్ అభిమానులు అందరినీ ఆప్యాయంగా పలకరించటం ఆమెకు అలవాటు.
అందుకే ఆమె పుట్టిన రోజున అంతా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Back to Top