కాకానికి ఊరట

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన్ను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెట్టిన కేసుకు సంబంధించి హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయడంతో కాకాణి గోవర్దన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా కాకాణిని అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారి పిలిస్తే విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు సూచించింది.

Back to Top