పట్టిసీమపై ఉన్న పట్టుదల పోలవరంపై ఏదీ: ఉదయభాను

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ పట్టిసీమ నిర్మాణంపై ప్రభుత్వానికి ఉన్న పట్టుదల పోలవరంపై చూపడం లేదని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల టీడీపీ నేతలకు తప్ప ఉభయగోదావరి, కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంత రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. ముడుపుల కోసమే పోలవరాన్ని పక్కనపెట్టి పట్టిసీమను నిర్మిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కలిపి అఖిలపక్షం వేసి, రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని, దీనికి భిన్నంగా చేయడం సరికాదని విమర్శించారు.

మంత్రి దేవినేని ఉమా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ నిరుపయోగమని చెప్పి ఇప్పుడు అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, దూలం నాగేశ్వరరావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్  తదితరులు పాల్గొన్నారు.
Back to Top