కుంటిసాకులతో వెనక్కు పోకుండా బహిరంగ చర్చకు రండి


విజయవాడ : బిట్కయిన్‌ స్కాం సూత్రధారి సైకం రామకృష్ణారెడ్డితో వైయస్‌ ఆర్‌ సీపీ ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఆరోపణలు చేసిన టిడిపి నాయకులు వర్ల రామయ్య జనవరి ఒకటో తేదీన ఎటువంటి ప్రకాశం బ్యారేజిపైన బహిరంగ చర్చకు సిద్ధపడాలని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి టిజెఆర్‌ సుధాకర్ బాబు డిమాండ్‌ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైకం రామకృష్ణారెడ్డే స్వయంగా తనకు వైయస్‌ ఆర్‌ సీపీతో సంబంధం లేదని ప్రకటించారని, ఆయన పార్టీ సేవాదళ్‌ తమిళనాడు కార్యదర్శిగా పనిచేసినప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్‌ లోనే ఆయనను సస్పెండ్‌ చేసిన సంగతిని సుధాకర్‌ బాబు గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రకాశం జిల్లాలోని సైకం రామకృష్ణారెడ్డి ఇంటిపైన ఎవరి ఫ్లెక్సీ ఉందో, చూడాలన్నారు  సంస్థ ఫ్లెక్సీలో ఉన్న లోకేష్‌ కు స్కాంలో ఎంత ముట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులు, ఆరోపణలు, కోర్టు స్టేలు తదితర అంశాలనీ బహిరంగ చర్చలో ప్రస్తావనకు వస్తాయన్నారు. అంశంపై టిడిపి నాయకులు వర్ల రామయ్య చేసిన ఆరోపణలపై తాను స్పందించి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేస్తే, వేదికను ప్రకాశం బ్యారేజి నుంచి బార్‌ అసోసియేషన్‌ కు వేదికను మార్చమనడం ఎంతమాత్రం సమంజసంగా లేదన్నారు.
బహిరంగ చర్చకు సవాల్‌ విసరడం, చివరకు దానిపై వెనక్కు తగ్గడమనేది తెలుగుదేశం పార్టీ నాయకుల నైజమనీ విమర్శించారు. పోలీసుల అనుమతి అని, శాంతిభద్రతలు అంటూ కుంటిసాకులకు పోకుండా, ప్రకాశం బ్యారేజి వద్దనే చర్చకు సిద్ధపడాలని సుధాకర్‌ బాబు అన్నారు. టిడిపి వారు అడిగినట్లుగా అన్ని ఆధారాలతో తాము చర్చకు వస్తామని, వారు కూడా తమ వద్ద అన్ని సాక్షాలను తీసుకుని రావాలన్నారు. 
మీరు చేసిన ఆరోపణలు నిజమని నిరూపితమైతే తాను క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని, అవాస్తమని తేలితే, రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం పనామా పేపర్లంటూ ప్రస్తావించిన చంద్రబాబు ఆరోపణలపై, ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ చేసిన సవాల్‌ పై ఇంతవరకు నోరు మెదపకుండా పారిపోయారని తీవ్రంగా మండిపడ్డారు. అదే కోవలో సైకం రామకృష్ణారెడ్డి ఉదంతాన్ని కూడా బురద చల్లడానికి వాడుకుంటున్నారని, సైకం ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమే కాకుండా, ఆయన చేస్తున్న కార్యక్రమాలపై గత జూలై నెలలోనే లీగల్‌ నోటీసులు కూడా జారీ చేసిన సంగతిని ఆయన ప్రస్తావించారు. 
వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ ఆర్‌ లాగా, మీపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణలకు ఎందుకు సిద్ధపడటం లేదని ప్రశ్నించారు.  ఏకంగా రాష్ట్రాన్నే వదిలిపెట్టి,  పాలన అంతటినీ తాత్కాలికం చేసిన ఓటుకు నోటు కేసుపై సిబిఐ విచారణకు సిద్ధమేనా అని, పట్టిసీమలో అవినీతిపైనా, రాజధాని భూములపైనా విచారణకు సిద్ధమైనా అని సుధాకర్‌ బాబు నిలదీశారు. ప్రకటించిన విధంగా, జనవరి 1 వ తేదీన ఈ అంశాలన్నిటిపైనా చర్చకు సిద్ధపడాలని ఆయన టిడిపి నాయకులను డిమాండ్‌ చేశారు.
 
Back to Top