బస వద్దే జనం బాధలు విన్న షర్మిల

వాడపల్లి (నల్గొండ జిల్లా) : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌ నగర్‌ బాంబు పేలుళ్ళ మృతులకు సంతాప సూచకంగా శ్రీమతి షర్మిల శుక్రవారం తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు విరామం ఇచ్చారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద బస చేసి ఉన్న శ్రీమతి షర్మిలను చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కలుసుకున్నారు. వారందరినీ శ్రీమతి షర్మిల చిరునవ్వుతో పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు.

శిబిరం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన :
శ్రీమతి షర్మిల బసచేసిన శిబిరం వద్ద మోస్టుబార్‌వర్డు క్లాస్‌ (ఎంబిసి) రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పి.పద్మావతి ఆధ్వర్యంలో ‌హైదరాబాద్ బాంబు పేలుళ్లకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాద వ్యతిరేక నినాదాలు చే‌స్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు.

వైయస్‌ఆర్‌సిపి నల్గొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, పా‌దూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, దామరచర్ల మండల కన్వీనర్ చల్లా అంజిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇంజం నర్సిరెడ్డి, భీమరాజు, నాయకులు ముండ్లగిరి కాంతయ్య,‌ నాగిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మండల యువజన విభాగ కన్వీనర్ కృష్ణయ్య, కరుణాక‌ర్‌రెడ్డి రామారావు నాయక్‌ శ్రీమతి షర్మిలను కలిసి పార్టీ గుర్తు ఫ్యాన్‌ను బహూకరించారు.

మిర్యాలగూడ డివిజన్‌లో 104 వాహనంలో పనిచేస్తున్న ఉద్యోగులు శుక్రవారం శ్రీమతి షర్మిలకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో డివిజన్ అధ్యక్షుడు జి.సైదయ్య, దేవేంద‌ర్, వెంకన్న,‌ రాంబాబు, సంపత్,‌ వెంకటేశ్వర్లు, శోభారాణి, కళ్యాణి ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను‌ శ్రీమతి షర్మిల రెండు రోజుల పాటు వాయిదా వేసుకుని దామరచర్ల మండలం వాడపల్లి వద్ద బసచేశారు. మూడవ రోజు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించి గుంటూరు జిల్లాకు వెళ్ళవలసి ఉంది. అయితే, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల కారణంగా మృతిచెందిన వారికి సంతాపంగా పాదయాత్రను మరో రోజు శుక్రవారం కూడా వాయిదా వేసుకున్నారు.
Back to Top