తొలిసారి ఒంగోలుకు బాలినేని

ప్రకాశం:  మాజీ మంత్రి, వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నూతన బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా బాలినేని ఇవాళ ఒంగోలుకు వస్తున్నారు.  ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 

మధ్యాహ్ననికి నెల్లూరు ప్రధాన రహదారిలోని వల్లూరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా రామ్‌నగర్, చర్చిసెంటర్, ట్రంకురోడ్డు, కర్నూలు రోడ్డు, ఫ్లైఓవర్ బ్రిడ్జి, మంగమూరు రోడ్డు మీదుగా జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.
బాలినేనికి జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు, పార్టీ కేడర్‌తో సత్సంబంధాలున్నాయి. మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. బాలినేని నాయకత్వంలో  మరింత ఉత్సాహంగా పనిచేసి, పార్టీని బలోపేతం చేసేందుకు  శ్రేణులు నూతనోత్తేజంతో ఉన్నాయి.  

Back to Top