బైబిల్ వివాదంపై హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు

హైదరాబాద్

1 నవంబర్ 2012 : విజయమ్మ బైబిల్ చేత ధరించి పర్యటిస్తున్నారని టిడిపి ఎంఎల్‌సి వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌ చేసిన ఆరోపణలు క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీశాయంటూ వైయస్ఆర్ సీపీ కృష్ణాజిల్లా నాయకుడు మేరుగ నాగార్జున రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాజేంద్రప్రసాద్‌పై చర్య తీసుకోవాలంటూ పోలీసుశాఖను ఆదేశించాలని ఆయన గురువారం కమిషన్‌ను కోరారు. రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు బైబిల్‌ను విశ్వసించి ఆరాధించే కోట్లాదిమంది దళిత, క్రిష్టియన్‌ల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్ 22న కృష్ణాజిల్లా నూజివీడు పోలీసు స్టేషన్‌లో రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశామనీ, అయితే ఇంతవరకు చర్యలు లేకపోవడంతో మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

Back to Top