బాబు పాలన పోవాలి

యం. చింతకుంట)) నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ గోస్పాడు మండలం యం. చింతకుంట చేరుకున్నారు. వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...రైతు రుణమాఫీ, డ్వాక్రారుణాలు, నిరుద్యోగ భృతి, ఇళ్లు సహా ఎన్నికల హామీల  గురించి ప్రశ్నిస్తే బాబు కళ్లు పెద్దవి చేసి మీరు జగన్ మనుషులంటూ ప్రజలను బెదిరిస్తున్నాడని ఫైర్ అయ్యారు. ప్రజలు జగన్ కు తోడుగా ఉంటారని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని బాబు పాలనను బంగాళాఖాతంలో కలుపుతారని స్పష్టం చేశారు. 

రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశాడు. ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశాడని బాబుపై జగన్ మండిపడ్డారు.  మళ్లీ ఇవాళ నంద్యాలకు వచ్చి అదే టేప్ రికార్డర్ ఆన్ చేసి అదిచేస్తా, ఇదీ చేస్తానని మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు బాబు మూడేళ్ల మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా వేస్తున్నామన్నది మర్చిపోవద్దన్నారు. నంద్యాలలో మనం వేసే ఈ ఓటు రాబోవు ఎన్నికలకు నాంది కావాలన్నారు. న్యాయం, ధర్మం వైపు నిలవాలని కోరారు. 

మూడేళ్లలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు సంపాదించాడని, ఆ అవినీతి సొమ్మును బయటకు తీసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే ప్రజలను కొనుగోలు చేసేందుకు డబ్బుల మూటలతో నంద్యాలకు వస్తున్నాడని వైయస్ జగన్ ఎండగట్టారు. ఎన్నికలు వచ్చేసరికి జేబులోంచి దేవుని పటం తీస్తాడు. మీ అందరితో ప్రమాణం చేయించుకొని డబ్బులిచ్చే కార్యక్రమం చేస్తాడన్నారు.  డబ్బుతో ఏమైనా చేయవచ్చన్న అధికార అహంకారంతో బాబు ఉన్నాడన్నారు. బాబు మాటలకు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మీ అందరి ఆశీస్సులు వైయస్సార్సీపీ కావాలని, బాబు పాలన పోవాలని అన్నారు. 
Back to Top