బాబు మాటలన్నీ నీటి మూటలే

విశాఖపట్నంః  

చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలేనని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  మండిపడ్డారు. బాబు నయవంచక పాలనను నిరసిస్తూ విశాఖపట్నంలోని సారగర తీరంలో నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం హామీలు - నీటి మూటలు, గాలి బుడగలు... మంత్రులు రాజీనామాలు చేయండి - ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్‌ను, నీటి మూటలను, గాలి బుడగలను చేత్తో పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పోలా గురువులు, జాన్‌వెడ్లీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top