బాబు తక్షణమే రాజీనామా చేయాలి

అనంతపురం :

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సలాంబాబు డిమాండ్‌ చేశారు. వైయస్సార్‌సీపీ నేతృత్వంలో బుధవారం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ బంద్ చేపట్టారు. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. హైవేను దిగ్భంధించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.  

ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట‍్లాడుతూ... చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి హోదా సాధించేంత వరకు పోరాడతామన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు గురువారం జిల్లాలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్పారు.

Back to Top