కరవు కష్టాలకు చంద్రబాబే కారణం

హైదరాబాద్) చంద్రబాబు
ప్రభుత్వ నిర్లిప్త వైఖరి కారణంగా కరవు తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని శాసనమండలిలో
వైఎస్సార్సీపీ పక్ష నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయ పడ్డారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో
మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని,  పశువులు కబేళాలకు వెళుతున్నాయని ఆవేదన
వ్యక్తం చేశారు.  ప్రభుత్వ వైఫల్యం గురించి కోర్టులు కూడా మొట్టికాయలు
వేస్తున్నాయన్నారు. రాష్ట్రాలు స్పందించకపోయినా కేంద్రమైనా స్పందించాలి కదా అని
హెచ్చరికలు చేశాయని ఉమ్మారెడ్డి
గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాల్లో పనికి వెళ్లిన
వారికి కూలీ డబ్బులు ఇంకా
చెల్లించలేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఇటీవల
ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా కరువుపై చర్చ జరిగిందని, ప్రతిపక్షంతో పాటు అధికారసభ్యులు కూడా వాదనలు వినిపించారని చెప్పారు.. ఐనా సరే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోని కారణంగా
ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఉమ్మారెడ్డి వివరించారు. కరువు నివేదిక సక్రమంగా, సమగ్రంగా
అందించని కారణంగా సరైన న్యాయం జరగలేదని వాపోయారు.  

Back to Top