హామీలు తప్ప..అభివృద్ధి శూన్యం..

విజయనగరంః బొబ్బిలి నియోజకవర్గంలో హామీలు ఇవ్వడం తప్ప ఏ ఒక్క పనిచేసినా దాఖలాలు లేవని వైయస్‌ఆర్‌సీపీ నేత  వెంకట చిన పుల్లారావు అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీరు అని,  వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు ఏదో సాధిస్తాడని ప్రజలు భావించారని కాని తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కోసమే ప్రజలను మభ్య పెట్టి మోసగించారన్నారు.  అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెప్పిన రంగారావు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. బొబ్బిలిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. జ్యూట్‌ మిల్లులు మూతపడి ఉన్నాయని, ఆరువేల మంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు.స్థానిక ఎమ్మెల్యేకి  ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. చక్కెర కార్మాగారాలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. గత సీజన్‌లో పంద కొండున్నర కోట్లు రూపాయాలు రైతులకు బకాయిలు పడిందన్నారు.  2కోట్లు రూపాయాలు జీతాలు బకాయిలు ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం పాలనలో సంక్షేమం ఆమడ దూరంలో ఉందన్నారు. అభివృద్ధి జరగాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. ప్రజలందరూ కూడా జననేతకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
Back to Top